విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్

విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రైల్వే జోన్ మొత్తానికి ఎన్నికల ముందు సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తునట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కాసేపటి క్రితం ప్రకటన చేశారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్‌ కోస్ట్‌ రైల్వేగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లతో ఈ జోన్‌ ఏర్పాటువుతుంది. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ సగం కొత్త జోన్ లోకి సగం ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి వెళ్తుంది.

మిగిలిన కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామని గోయల్‌ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లుండి విశాఖపట్నంలో ఒక బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అంతకు రెండు రోజుల ముందుగా ఈ ప్రకటన రావడం విశేషం. గత నాలుగున్నర ఏళ్లుగా ప్రత్యేక రైల్వే జోన్ అనేది సాధ్యం కాదు అని చెబుతూ వచ్చిన కేంద్రం మొత్తానికి ఎన్నికల ముంగిట రాజకీయ లబ్ది కోసం ఈ ప్రకటన చేసింది.

Comments

comments