వైఎస్ షర్మిల కేసులో ఇప్పటివరకు రెండు అరెస్టులు

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఇచ్చిన కంప్లయింట్ పై తెలంగాణ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గత వారం మంచిర్యాల జిల్లా రామ్‌నగర్‌కు చెందిన అడ్డూరి నవీన్‌ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో నిందితుడు పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సెక్షన్‌ 509 ఐపీఎస్‌, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 18 మందికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. దీనితో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ కేసులో వీడియోలు పోస్ట్‌ చేసిన వారితోపాటు కామెంట్లు చేసిన వారూ నిందితులుగా మారతారని పోలీసులు చెప్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య చిగురించిన కొత్త స్నేహం వల్ల కావొచ్చు మరేదైనా కారణం కావొచ్చు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.

Comments

comments