తెలంగాణ మంత్రులు… వారి శాఖలు…

తెలంగాణ మంత్రులు... వారి శాఖలు...

ఈరోజు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలు కేటాయించారు. ఇప్పటిదాకా వార్తలలో ఉన్న శాఖలకు పెను మార్పులు జరగడం విశేషం. నిరంజన్‌రెడ్డికి ఆర్థిక శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ సీఎం.. ఆశాఖను ఎవరికీ కేటాయించలేదు. ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. తెలంగాణలోని మంత్రులు, వారి శాఖలు ఈ విధంగా ఉన్నాయి:

కే చంద్రశేఖర రావు: ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు

మహమూద్ అలీ: హోమ్

ఈటల రాజేందర్‌: వైద్య ఆరోగ్యశాఖ

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌: పశుసంవర్థకశాఖ

ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్‌శాఖ

నిరంజన్‌రెడ్డి: వ్యవసాయశాఖ

కొప్పుల ఈశ్వర్‌: సంక్షేమశాఖ

చామకూర మల్లారెడ్డి: కార్మిక శాఖ

జగదీశ్‌రెడ్డి: విద్యాశాఖ

శ్రీనివాస్‌గౌడ్‌: ఎక్సైజ్‌శాఖ, పర్యాటకశాఖ

ప్రశాంత్‌రెడ్డి: రవాణా, రహదారులు, భవనాలశాఖ

Comments

comments