రైల్వే జోన్ పై టీడీపీ మార్కు రాజకీయం

ఎన్నికల తరుణంలో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించింది. సరిగ్గా ప్రధాని వైజాగ్ పర్యటనకు రెండు రోజుల ముందు ఈ ప్రకటన వచ్చింది. ఇది రాజకీయ లబ్ది కోసమే అని విస్పష్టం. అయితే అధికార టీడీపీ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాల్తేర్‌ డివిజన్‌ ను రెండు ముక్కలు చేసి బాగా రెవిన్యూ వచ్చే భాగాన్ని ఒడిశాకు ఇస్తున్నారని ఇది అన్యాయమని వాదిస్తుంది. దీని వల్ల 6500 కోట్ల నష్టమని, సరకు రవాణా మేజర్ గా ఒడిశాకు వెళ్ళిపోతుంది.

అయితే ఏ జోన్ కు ఎంత ఆదాయం వచ్చినా నష్టం వచ్చినా అది అంతిమంగా ఆదాయం భారతీయ రైల్వేకు వెళుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. టీడీపీ మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు బీజేపీకి క్రెడిట్ రాకుండా ఈ వాదనను తెర మీదకు తెచ్చింది టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు గానీ, వాల్తేర్ డివిజన్ మింగేశారు. ఏపికి రూ.6,500 కోట్లు నష్టం చేసారు అంటూ ట్వీట్ చేశారు. ఇందులో ఏపీకి వచ్చిన నష్టమేంటో? లాభం వస్తే అదేమైనా ఏపీకి వస్తుందా?

Comments

comments