తారకరత్న రెస్టారెంట్‌ కూల్చివేత యత్నం

హైదరాబాద్ లో నందమూరి హీరో తారకరత్నకు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.12లో తారక రత్న నడుపుతున్న కబరా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను కూల్చడానికి ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో తారక రత్న అక్కడకు వచ్చి అధికారులను రెస్టారెంట్‌ లోని సామాను తరలించడానికి మూడు గంటల సమయం అడిగారు. దీనికి అధికారులు ఒప్పుకున్నారు.

బంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారన్న కారణంతోనే కూల్చడానికి సిద్ధమయినట్టు అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు, సౌండ్స్‌తో న్యూసెన్స్‌ చేస్తున్నారని సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు. అయితే రెస్టారెంట్‌ నిర్వాహకులు మాత్రం దీనిని ఖండించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన రెస్టారెంట్‌ కావడంతోనే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించడం గమనార్హం.

Comments

comments