రేవంత్ రెడ్డి పట్టుమని మూడు నెలలు కూడా మాట మీద ఉండలేకపోయారుగా?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్యంగా గత ఎన్నికలలో ఓడిపోయారు. దీనితో మూడు సంవత్సరాల వరకు మీడియాతో మాట్లాడను అని శపథం చేశారు. ముఖ్యమంత్రి కుటుంబం మీద మితిమీరిన వ్యాఖ్యలు చెయ్యడం వల్లే నష్టపోయాను అని రేవంత్ అభిప్రాయమట. అయితే ఆ మాట మీద కనీసం మూడు నెలలు కూడా ఉండలేకపోయారు రేవంత్. నిన్న మీడియా ముందుకు వచ్చి అధికారపార్టీ మీద మరోసారి అభియోగాలు చేశారు.

తెలంగాణ మాజి మంత్రి హరీష్ రావు అమిత్ షాతో టచ్ లో ఉన్నారని, ఆ విషయం తెలియడంతోనే ఆయనను కేసీఆర్ పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లది ఫెవికాల్‌ బంధమని ఎద్దేవా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసింది ప్రజలు కాదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు వేశారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు ఆయన. కేటీఆర్‌ను ‘రాము’ అని పిలిచినందుకే మాజీ మంత్రి తుమ్మల ఔట్‌ అయిపోయారని అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేసారు.

Comments

comments