PR: YATRA Songs

pr-yatra-songs

TITLE: ‘యాత్ర ‘ సినిమా లో అద్భుత పాటలు !

Body: ‘యాత్ర ‘ సినిమాకు 5 అద్భుత పాటలు అందించిన సిరివెన్నెల !

70 MM  బ్యానర్  పై  మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత  వైస్ రాజశేఖర్ రెడ్డి  900 కిలోమీటర్ల  చారిత్రాత్మక పాదయాత్ర ను దృశ్య రూపం లోఅందిస్తున్న “యాత్ర” సినిమా కొరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి  రాజశేఖరుని  జీవితం లో జరిగిన  అనేక ప్రముఖ  సంఘటనల పై ,అయన నాయకత్వ శైలి పై , పాదయాత్రకు ముందు ,మధ్యలో ,చివరన  జరిగిన  సంఘ్టనలు ప్రజల సమస్యల పై  వైస్సార్ స్పందన ,వైస్సార్ పై  ప్రజలకు  వున్న విశ్వాసం ,ఏర్పడిన నమ్మకము  ప్రతి బింబించేలా రాసిన అద్భుత సాహిత్యపు పాటలను  K  కిరణ్ కుమార్  సంగీత దర్శకుడు అత్యంత ప్రతిభ తో వీనుల విందుగా మలిచారు.

1) ” సమర శంఖం ”

అంటూ కాలభైరవ స్వర పరిచిన పాట లో   రాజశేఖరుడు యాత్రకు ముందు ఆయన అంతరంగం, పాదయాత్ర లక్ష్యం ,తండ్రి  రాజారెడ్డి తనను ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడుగా మలిచిన తరువాత తండ్రి ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలనుకొన్నకల ,రాజశేఖరుని మనసులో ఏదో ఉద్వేగం,ఆరాటం,పోరాటం,ప్రజల్లోఉండి,వారి గుండె తడి విందాము అన్న   కొత్త ఆలోచనలతో,మెళుకువ తో వడివడిగా  మొదలయ్యే యాత్ర  తనని తానే జయించ గలిగె స్థితికి  నాయకుడు ఒక మహానాయకుడుగా మారే పక్రియను తెలియజేస్తూ  సిరివెన్నెల గారు  అద్భుత మైన  పదాలను భావయుక్తముగా కూర్చి  అమర్చారు

నీ కనులలో కోలుమై రగిలే కలేదో  నిజమై తెలవారని వెతికే వెలుగై రాని

ఈనాటి ఈ సుప్రభాత గీతం నీకిదే స్వాగతం అన్నది !

ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం చూపదా అల్లదే  చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్దమన్నది  అంతరంగమే కదన మన్నది

ప్రాణమే బాణమల్లె  తిరుగుతున్నది

నిన్ను నీవే జయంచి రారా రాజశేఖరా అంటున్నది

నీ మనసులో  మండు టెండలాగా నిప్పులే చెరగని నిశ్శయం

నీ గుండె లో మంచుటెండలాగ   నిత్యమూ నిలవని నమ్మకం

వసుధకు  వందనం చేయకుండా  నింగి  పైకి ఏగురు తుందా గెలుపు  జెండా

ఆశయం నెత్తురై పొంగ కుండా  శ్వాసలో సమర శంఖం ఆగుతుందా

2)   మందితో పాటుగా ముందుకే సాగనా

మరో అద్భుత పాట  వైస్సార్  ప్రజాయాత్ర కు ఉపక్రమించే ముందు యాత్ర చేయడమా ,మానడమా,అనుకూలాలు ప్రతికూలాలు  బేరీజు వేసుకొంటూ రాజశేఖరుని మస్తిత్వం లో జరిగే ఆలోచనల అంతర్యుద్ధాన్ని వర్ణిస్తూ ,చివరగా  తనపై పేద ప్రజలు చూపిస్తున్న  ప్రేమను, నమ్మకాన్ని,విశ్వాసాన్ని   వారి హృదయ  స్పందనలకు ప్రతిగా కార్యములోకి దిగక తప్పదు అన్న ఆలోచనల్ని , తన మనస్సులో  రగిలే భావాలను  అద్భుతంగా రాశారు . సాయి చరణ్ పాడిన  ఈ గీతం గొప్పగా ఆకట్టుకొంటుంది .

“మందితో పాటుగా ముందుకే సాగనా!

ఎందుకో తోచక ఒంటిగా ఆగనా !

ఏ దరి లేదని   ఈదడం మాననా!

ఎంతకీ తీరని ప్రశ్నగా మారనా !

అందరూ ఆశగా చూస్తుండగా , అనుక్షణం నీడగా వెంట వస్తుండగా

మొదటి అడుగు నీవై నడవాలిగా నమ్మకం బాటగా నడిచి తీరాలిగా

3) పల్లెల్లో కళ ఉంది

రైతే రాజు ,గ్రామ స్వరాజ్యం మే  దేశ సౌభాగ్యం అనే  వొట్టి  సానుభూతి మాటల్లో పస వుందా? రైతుకు ఎమన్నా ఉపయోగం వుందా ?

కరువుతో రైతు నిత్యం బాధపడుతూ  ఆకలి మంటలలో ,రెక్కల కష్టానికి ప్రతి ఫలం ఇవ్వని పంటలు ,రైతు జీవచ్ఛవం లా  బ్రతుకీడుస్తూ

వుంటే ఎవ్వరికి పట్టదా వారి  కష్టాలు,వారి వ్యధలు వినే ఓపిక ఏ ప్రభుత్వాలకు వుంది  అంటూ ఈ పాటను అందించారు . మమ్మల్ని రాజులుగా కాదు కనీసం రైతుల్లాగా అన్నా చూడండి అంటూ   ప్రముఖ గాయకుడూ  SP  బాల సుబ్రమణ్యం స్వర పరచిన  ఈ క్రింది గీతం రైతుల

అసహయతను వినిపిస్తుంది .

“పల్లెల్లో కళ ఉంది – పంటల్లో కలిముందిఅని చెప్పే మాటల్లో విలువేముంది ?

కళ్ళల్లో నీరుంది – ఒళ్ళంతా చెమంటుంది

ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది

చినుకివ్వని మబ్బుంది – మొలకివ్వని మన్నుంది

కరుణించని కరువుంది – ఇంకేముంది ?

రైతేగా రాజంటూ అనగానే ఏమైంది ?

అది ఏదో నిందల్లే వినబడుతోంది

అనుదినం ప్రతి క్షణం బదులేమివ్వని ప్రశ్నగా మారెనే కొడవలి ?

పైరుకా , పురుగుకా ఎవరికి మేలని తెలుసునా విషమయే ముందుకి ?

వరి వెన్నే విరిసేనా గ్రామసీమ వాడితే ?

మనవెన్నే నిలిచేనా రైతు పేగు మాడితే ?

నమ్ముకున్న నేలతల్లి నెర్రెలుగా చీలితే ?

అమ్ముకున్న జీవాలన్నీ కబేళాకి చేరితే ?

ఏ చెవికీ వినబడవేం పల్లె తల్లి ఘోషలు ?

ఎవ్వరికీ కనబడవేం చిల్లుపడిన ఆశలు ?

4) “రాజన్నా నిన్ను ఆపగలరా” !

రాజశేఖరుని పాద  యాత్రలో ప్రజలు మమేకమై ప్రతి గ్రామంలో  ఆయనకు అపూర్వ స్వాగతం పలుక డాన్ని వర్ణిస్తూ , వారి యాత్రతో  ఉప్పొంగిన ప్రజా స్పందనను తెలియ చేస్తూ,వారి సమస్యలపై  మాట ఇచ్చి

తీర్చే మహా నాయకుడు వచ్చాడు అంటూ , ప్రతి పల్లెలో  జనం ఎలా జేజేలు పలికారనే విషయాన్ని ,అప్పట్లో అయన పాదయాత్ర ను ఆపడానికి ప్రయత్నించిన కొందరి కాంగ్రెస్ నాయకుల ప్రయత్నం ఎలా వమ్ము అయినది సృశిస్తూ

“రాజన్నా నిన్ను ఆపగలరా”  అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతం వినసొంపుగా వున్నది .

వూరే ఏరేల్లా మారే ..   హోరు హోరున ఉప్పెంగేరో

దార్లే  తారంగ మాడి  చేతులెత్తి  జై కొట్టేరో !

మండి పోయే తలపై గొడుగువలె తానొచ్ఛేరో

మందికోసమే తానున్నానంటూ  మాటిచ్చే మహారాజు నంటూ

మెతుకుని ఎరుగని బ్రతుకుల మొరవిని

నీటి మబ్బులా మెరిశాడు  వాన చినుకులా కరిగాడు

5)  నీరాక కోసం

ఓక మహానాయకుడి కోసం ఎదురుచూసే ప్రజల మనసు లో ని పాటను అద్భుతంగా మలిచారు,శంకర్ మహదేవన్ స్వర పరచిన

నీరాక కోసం వెతికే చూపులవుతాం !

మా పొద్దు పోడుపా!…  జయహో

నీ వెంట నిత్యం నడిచే సైన్యం అవుతాం !

మా గెలుపు మలుపా జయహో !

ఎవరూ లేరని ఎవరు రారని తపిస్తున్న మా  కలలాగా

తానే పంపని నువ్వున్నావని   సత్యం నమ్మని

6) “మరుగైనావా రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా !

పాటల రచయిత, గాయకుడు పెంచల్‌దాస్ రాసిన చివరి పాట “మరుగైనావా రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా”  ప్రేక్షకుల గుండెల్ని పిండేసి కళ్ల నీళ్లు తెప్పిస్తుంది. రచయిత తనకు దివంగత నేత పై ఉన్న అభిమానాన్ని ,ఆయన అభిమానులు రాజశేఖరుని మరణ వార్త విన్న తరువాత వారి తీవ్ర దుఃఖాన్ని ,మనో వేదన ను పాట రూపంగా సులభమైన పదాలతో ప్రజలకు అర్ధమయ్యేలా వ్రాశారు ఆయనే ఆవేదనగా   పాడిన పాట  ప్రేక్షకులను చివర్లో

కంట తడి పుట్టిస్తుంది .

“మరుగైనావా రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా

మా ఇంటి దేవుడవే ,మా కంటి వెలుగై

ఒరిగినావ రాజన్న ఒరిగినావ రాజన్న !”

…………………………………………………………………

నువోచ్ఛే దారిలో పున్నాగ పువ్వోల్లె నీకోసం వేచుంటే

చేజారిపోతివా  రాజన్న…

….. కనుమరుగయ్యావా రాజన్న

మాట తప్పని  రాజన్న  మడమ తిప్పని వాడివయ  మరువ జాలం నీ రూపం

నీకు సాటి ఎవరయ్యా !”

వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి అభిమానులే అతిధులుగా  హాజరై  ‘యాత్ర’ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో తమ మాటల్లో పంచుకున్నారు.

మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో నటించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది.

Comments

comments