రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ కు సర్వం సిద్ధం

ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో రేపు పోలింగ్‌ జరగబోతుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అందజేశారు. అనంతరం పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌లకు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సమస్యాత్మకంగా ఉండే పోలింగ్‌ కేంద్రాల వద్ద మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అయితే మొదటి విడత లో ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల ఫలితాల కోసం మాత్రం మే 23 అంటే దాదాపుగా నెలన్నర పాటు వేచి చూడాల్సిందే.

Comments

comments