పవన్ కళ్యాణ్ గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడా?

lack-of-coverage-hurting-pawan-kalyan

గుంటూరులో నిర్వహించిన భాజపా ప్రజా చైతన్య సభకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు అయ్యారు. తన ప్రస్తుత ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఎన్నికల దగ్గరగా ఉన్న సమయంలో అయినా రాష్ట్రానికి ఏమైనా ప్రకటిస్తారేమో, స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదో చెబుతారేమో అనుకుంటే అదీ లేదు. దానికి చంద్రబాబు కూడా ఘాటుగానే సమాధానం చెప్పారు. ఇదంతా పక్కన పెడితే జగన్, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటించేశారు.

నిరసన కాదు కదా కనీసం మాకు ఇది ఎందుకు చెయ్యలేదు? ఇదైనా చెయ్యండి అని కూడా అడిగే ధైర్యం చెయ్యలేదు. జగన్ సరే విమర్శిస్తే ఎన్నికల ముందు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డారేమో పవన్ కళ్యాణ్ కూడా మిన్నకుండి పోవడం విశేషం. మాకు పాచి పోయిన లడ్డులు ఇచ్చారు అన్న పవన్ కళ్యాణ్, మాకు 75000 కోట్లకు పైగా ఇవ్వాలని కమిటి వేసి తేల్చి, అవసరమైతే నిరాహార దీక్షకు కూర్చుంటా అని చెప్పి ఇప్పుడు మొత్తానికి మొహం చాటేశారు. మొత్తానికి ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పుకోవాలి. తనదైన శైలిలో పోరాడితే ప్రజలకు హీరో అయ్యే వారు.

Comments

comments