అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ గవర్నర్ ను ఎందుకు కలిసినట్టు?

రాయలసీమ టూర్ లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. ఆళ్లగడ్డ పర్యటనను రద్దు చేసుకొని పవన్ అహోబిలం వెళ్లారు. అప్పటికే గవర్నర్ అహోబిలంలో ఉన్నారు. గవర్నర్‌ నరసింహన్‌తో 15 నిమిషాల పాటు పవన్‌ సమావేశమయ్యారు. అనేక విషయాలపై చర్చించారు. అయితే గవర్నర్ ను కలిసిన తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఎన్నికల వేళ జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వారు ఏం చర్చించారు అనేది బయటకు రానీయలేదు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని మాత్రమే చెప్పి జనసేన వర్గాలు దాటేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా గవర్నర్ ఏమైనా ప్రత్యేక వార్త మోసుకుని వచ్చారా అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Comments

comments