పవన్ కల్యాణ్ కి కేసీఆర్, కేటీఆర్ ఏం చెప్పారు?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో తెరాస.. వైకాపా ఒక్కటయ్యాయని పవన్ కల్యాణ్‌‌ కూడా తప్పు పట్టారు.

తెరాసను దెబ్బతీసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తెరాస నేతలు అడ్డుకున్నారు. తెలంగాణలో జగన్‌ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన నేతలే ఇప్పడు ఆయనకు సపోర్టు చేస్తున్నారు అని విమర్శించారని ఇది వరకే పవన్ కల్యాణ్‌‌ విమర్శించారు. ఇటువంటి సమయంలో ఆయన కేసీఆర్, కేటీఆర్ లతో ప్రత్యేకంగా మాట్లాడటం ఆసక్తి రేపింది. అసలు పవన్ కల్యాణ్ కి కేసీఆర్, కేటీఆర్ ఏం చెప్పుంటారు అనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Comments

comments