పవన్ కళ్యాణ్ మాత్రమే చిరంజీవిని ధిక్కరించాలా?

నిన్న తూర్పు గోదావరి రాజమహేంద్రవరంలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇది వరకు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న కురసాల కన్నబాబు, వంగా గీత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడాన్ని ఆయన తప్పు పట్టారు. వారంటే అన్నయ్య చిరంజీవికి చాలా ఇష్టమని అటువంటి వ్యక్తిని మోసం చేశారని ఆయన విమర్శించారు. కన్నా బాబు, గీత ప్రజారాజ్యం పార్టీ విలీనం సందర్భంగా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పోవడంతో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వారు జనసేనలో చేరకపోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పడుతున్నట్టు ఉంది. చిరంజీవి పార్టీని విలీనం చేసాకా కూడా మాజీ ప్రజారాజ్యం పార్టీ నాయకులు విధేయులుగా ఉండాలా? పవన్ కళ్యాణే అన్నను కాదని టీడీపీకి సపోర్టు చేశా అని చెప్పుకుంటారు. మిగతా వారికి ఆ అవకాశం ఉండదా? మాజీ పీఆర్ఫీ నాయకులు పవన్ కళ్యాణ్ కు ఏమైనా బానిసలా? వారి రాజకీయ నిర్ణయాలు వారు తీసుకోకూడదా?

Comments

comments