జనసేన ప్రచారానికి తేజ్ కు పవన్ పర్మిషన్ ఇవ్వలేదట

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అలియాస్ సాయి తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా సినిమాలో హీరోయిన్స్ గా కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాపై తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

శుక్రవారం రిలీజ్ కాబోతున్న తన సినిమా సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు సాయి తేజ్. అక్కడ మీడియాతో మాట్లాడిన సాయి తేజ్ సినిమా ప్రమోషన్స్ తో పాటుగా పవన్ గురించి ప్రస్థావించడం జరిగింది. జనసేన ప్రచారంలో ఇప్పటికే వరుణ్ తేజ్, నిహారిక, అల్లు అర్జున్ పాల్గొన్నారు మీరు ఎందుకు పాల్గొనలేదని మీడియా ప్రశ్నించగా మామయ్య అందుకు పర్మిషన్ ఇవ్వలేదని అన్నాడని సమాధానం ఇచ్చాడు సాయి తేజ్.
సినిమాలు రాజకీయాలు రెండు పడవల మీద కాలు పెట్టొద్దని అందుకే తనని ప్రచారంలో పాల్గొన వద్దని అన్నాడట. అయితే మామయ్య మాటని సిరసా వహించే తను జనసేన ప్రచారంలో పాల్గొనలేదని అన్నాడు సాయి తేజ్. 11న జరుగనున్న ఏపి ఎలక్షన్స్ లో జనసేన ప్రభావం ఎంత ఉంది అన్నది ఇప్పుడేం చెప్పలేం.

నాగబాబు కోసం వరుణ్ తేజ్, నిహారిక రాగా.. ఈరోజు అల్లు అర్జున్ కూడా జనసేన ప్రచారంలో పాల్గొనడం హాట్ న్యూస్ గా మారింది. రీసెంట్ గా జనసేనకు సపోర్ట్ గా ఓ లెటర్ రాసిన బన్ని ప్రచారంలో పాగ్లొనడని అనుకున్నారు కాని ఈరోజు ప్రచారం ముగించే సమయంలో బన్ని తన మార్క్ చూపించాడు.

Comments

comments