జనసేనలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నుండి వలసలు పెరగడం విశేషం. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే జనసేనలోకి మరో ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే జనసేనకు టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మంగళవారం విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ను కలిశారు. ఫిబ్రవరి 10న బెంగళూరులో జరగనున్న తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను ఆయనకు అందజేశారు.

పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికే చెందిన త్రిమూర్తులు పై పార్టీ మారాలని ఒత్తిడి ఎప్పటినుండో ఉంది. ఇప్పటికే ఆయన జిల్లాలో పార్టీ కోసం అనధికారికంగా పని చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేవలం సరైన సమయం కోసం ఆయన వేచి చూస్తున్నారట. మరోవైపు టీడీపీకి మద్దతు ఇస్తున్న స్వతంత్రం ఎమ్మెల్యే చీరలకు చెందిన ఆమంచి కృష్ణ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈరోజో రేపో ఆయన లోటస్ పాండ్ లో జగన్ ను కలవనున్నారు.

Comments

comments