ఉండవల్లి మీద ఉన్న నమ్మకం కూడా చంద్రబాబు మీద లేదా?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంటుంది. నిన్న విజయవాడలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల తర్వాత వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలపట్ల పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో పోరాడాలని ఉండవల్లి ఇచ్చిన పిలుపుకు అన్ని పక్షాలు సుముఖత తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్, సిపిఎం తప్ప అన్ని పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. అయితే దీనికి ప్రధాన పార్టీలన్నీ డుమ్మా కొట్టడం కొసమెరుపు. వైఎస్సాఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన ఇలా ఏ ఒక్క రాజకీయ పార్టీకూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనితో ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలు కొన్ని మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఉండవల్లి కి ఉన్న పాటి క్రెడిబిలిటీ కూడా ఈరోజున చంద్రబాబుకు లేకుండా పోయిందా?

Comments

comments