చంద్రబాబు ఢిల్లీ దీక్షకు పెల్లుబిక్కిన జాతీయ నేతల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్క రోజు ధర్మపోరాట దీక్షకు జాతీయ స్థాయి నేతల నుండి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి తమకు సానుభూతి ఉందని, రాష్ట్రానికి న్యాయం చెయ్యాలి అనే దానికి తమందరి మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చి తమ సంఘీభావం ప్రకటించారు.

తాము అధికారంలోకి వచ్చాకా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలు అన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సమాజ్ వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్, త్రిణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రెయిన్‌, శరద్‌యాదవ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, వంటి నేతలు కూడా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు దీక్ష ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించినా లేకపోయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళి వివిధ పార్టీల మద్దతు కూడగట్టారని అనుకోవచ్చు.

Comments

comments