మోడీ గారూ .. అబద్దలైనా ముందు ఒక మాట అనుకుని చెప్పండి

narendra-modi-lies-in-todays-ap-meet

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసింది అనడంలో రాష్ట్రాల్లోని ఏ రాజకీయ పార్టీకి అనుమానం లేదు. అయితే బీజేపీ మాత్రం మేము అన్నీ చేసేశాం అన్నీ ఇచ్చేశాం అని చెప్పుకుంటుంది. ఈ నెలలో రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు 10 లక్షల కోట్లు ఇచ్చాం కావాలంటే థర్డ్ పార్టీతో విచారణకు కూడా సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. ఆయన వచ్చి వెళ్లిన కొన్ని రోజులకు అమిత్ షా వచ్చి పలాసలో ఒక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదు లక్షల కోట్లు ఇచ్చాం అన్నారు.

ఈరోజు గుంటూరులో నిర్వహించిన భాజపా ప్రజా చైతన్య సభలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు మూడున్న లక్షల కోట్లు ఇచ్చేశాం అన్నారు. నెల రోజులు తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చాం అని చెప్పుకున్న దానిలో ఆరున్నర లక్షల కోట్లు మాయం. ఎన్నికల ప్రచారం సమయానికైనా అందరూ ఒక మాట అనుకుని అబద్దం చెబితే కొందరైనా నమ్మే పరిస్థితి ఉంటుంది.

Comments

comments