తెలంగాణలో రెడ్డి రాజ్యమే

తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పది మంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటికే ఉన్న ఇద్దరు మంత్రులతో పాటు మరొక పది మంది ప్రమాణస్వీకారం చేశారు. సామజిక వర్గాల పరంగా చూస్తే కేసీఆర్ కేబినెట్ లో అత్యధికంగా ఐదుగురు రెడ్ల కు అవకాశం దక్కింది. మిగతా వారిలో ముగ్గురు బీసీలు, ఇద్దరు వెలమ (ముఖ్యమంత్రి కూడా ఇదే సామజిక వర్గం), ఒక ఎస్సీ, ఒక ముస్లిమ్ ఉన్నారు.

ముఖ్యమంత్రి సామాజిక వర్గం కాకుండా రెడ్ల కు పెద్ద పీఠ వెయ్యడం గమనార్హం. కేటీఆర్, హరీష్ రావులను పక్కన పెట్టడంతో వెలమల ప్రాతినిథ్యం తగ్గినట్టు అయ్యింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరూ లేకపోవడం విశేషం. శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సీఎం కేసీఆర్‌, మంత్రి మహమూద్‌అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరిగింది. సార్వత్రిక ఎన్నికల తరువాత మరో మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Comments

comments