మోహన్ బాబు ఉన్న ఆ కాస్త మర్యాద కూడా పోగొట్టుకుంటారేమో?

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మోహన్ బాబు ఎక్కడో గట్టిగానే చెడినట్టు ఉంది. చంద్రబాబు పై ఆయన దారుణమైన విమర్శలే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నీచుడు.. గజదొంగ.. దొంగల పార్టీకి అధినేతని మోహన్‌బాబు ఆరోపించారు. తప్పు చేస్తున్న చంద్రబాబును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అన్న ఎన్టీఆర్‌నే మోసం చేసిన మహా ఘనుడు చంద్రబాబని మండిపడ్డారు.

అబద్దాల కోరు చంద్రబాబుకు ఓటు వేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. వంగి వంగి నమస్కారాలు చేస్తున్న ద్రోహిని సాగనంపాలంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబుతో 40 ఏళ్లపాటు తనకు స్నేహం ఉందని, అందుకే ఆయన నీచపు బుద్ధి తనకు తెలుసునని ఆయన అన్నారు. ఇదంతా బానే ఉంది. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచినప్పుడు మోహన్ బాబు ఆయన పక్కన ఎందుకు ఉన్నట్టు? ఆ ఎపిసోడ్ తరువాత కూడా ఎందుకు పార్టీలో కొనసాగినట్టు? 40 ఏళ్ల స్నేహం ఎందుకు చేసినట్టు? రాజకీయాలలోకి వచ్చి మోహన్ బాబు ఉన్న ఆ కాస్త మర్యాద కూడా పోగొట్టుకుంటారేమో?

Comments

comments