చంద్రబాబును మోడీ వెన్నుపోటు దారుడు అన్నారా?

నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షంపై మరోసారి విరుచుకుపడ్డారు. మరోసారి తనదైన శైలిలో సెంటిమెంట్ పండించారు. కాంగ్రెస్ పార్టీ ఒక పేద వాడు తమ వంశాన్ని గద్దె దించడం జీర్ణించుకోలేకపోతోంది అంటూ తన దైన శైలిలో పార్లమెంట్ సాక్షిగా చిలక పలుకులు పలికారు. ప్రధాని తన ప్రసంగంలో ఇంకో ఆసక్తికరమైన మాట అన్నారు.

“మాకొచ్చిన మెజారిటీ 2004లో వాజపాయ్ జికి వచ్చిఉంటే దేశం అప్పుడే బాగుపడేది. అప్పుడు మాతో వుండి, తరువాత వెళ్ళిపోయి మోసము చేసిన (వెన్నుపోటు)ఒకాయన మీ (కాంగ్రెస్ )పంచన చేరాడు.” అని మోడీ అన్నారు. ఇది 2004 తరువాత ఎన్డీయే నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడును ఉద్దేశించే అని ఏపీ బీజేపీ నేతలు భాష్యం చెబుతున్నారు. 2004లో టీడీపీ బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్లాయి. ఓడిపోయాక టీడీపీ బయటకు వచ్చింది. మరి ఇందులో చంద్రబాబుని అనడం ఏంటో. ఒకవేళ ఏదైనా కారణం వల్ల చంద్రబాబే కారణం అని అనుకున్నా మరి మోడీ గారు ఆ వెన్నుపోటుదారుడితో 2014లో ఎందుకు చేతులు కలిపినట్టో?

Comments

comments