ఎన్నికల తరువాత మద్దతు కోసం కేసీఆర్ ను కాకా పడుతున్న మోడీ?

modi-compromise-with-kcr

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. చాలా మంది మాత్రం బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కాకపోతే ఈ సారి ఒంటరిగా కాకుండా పొత్తులతో అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉన్న టీఆర్ఎస్ పై బీజేపీ కన్నేసింది. ఈ క్రమంలో కేసీఆర్ ఎప్పటినుండో అడుగుతున్న కొత్త సచివాలయానికి అడ్డంకులు తొలగిస్తుంది కేంద్రం.

కేంద్రంలోని రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్స్ లో సచివాలయం కట్టాలని కేసీఆర్ ఎప్పటి నుండో అనుకుంటున్నారు. దీనిపై ఉన్న అన్ని సమస్యలను కేంద్రం పరిష్కరించినట్టు సమాచారం. తొందరలోనే ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పజెప్పబోతుందని తెలుస్తుంది. ఎన్నికల తరువాత కేసీఆర్ అవసరం కోసం ఎన్నికల కంటే ముందే కేసీఆర్ కు నజరానా ఇవ్వాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారట. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబందించిన కీలక అటవీ శాఖ అనుమతులు కూడా కేంద్రం ఇచ్చేసింది.

Comments

comments