ఖరారైన మోడీ ఏపీ పర్యటన

gvl-warning-to-ap-people

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 10న ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. గుంటూరులో బీజేపీ ఆద్వర్యంలోని భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాత మోడీ ఆంధ్రప్రదేశ్ రావడం ఇదే తొలి సారి. ఆయన ఈ నెలలోనే రావాల్సి ఉండగా చివరి నిముషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. పరిస్థితుల బాలేవని ఇంటలిజెన్స్ నివేదిక రావడం వల్లే పర్యటన వాయిదా వేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమింపబడ్డాకా మోడీ రావడం ఇదే మొదటి సారి. అందులోనూ కన్నా సొంత జిల్లా కు రావడంతో తన సత్తా చూపించుకోవాలని కన్నా ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబు నాయుడు పై మోడీ ఈ మీటింగులో విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే నెల 4న బీజేపీ ప్రెసిడెంట్ అమిత్‌ షా పర్యటన ఉంటుందని, మూడు విడతలుగా ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని సమాచారం.

Comments

comments