రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

mlc elections in telugu states

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలకుగాను ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

షెడ్యూల్ వివరాలు..
నోటిఫికేషన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 21
నామినేషన్ల చివరి తేది: ఫిబ్రవరి 28
నామినేషన్ల పరిశీలన: మార్చి 01
ఉప సంహరణకు గడువు: మార్చి 05
పోలింగ్ తేదీ: మార్చి 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు
కౌంటింగ్ ప్రక్రియ: మార్చి 12న సాయంత్రం 5 గంటలకు
ఎన్నికల ప్రక్రియ ముగింపు: మార్చి 15

మరోవైపు ఈ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టే. ఈ కోడ్ ముగియక ముందే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుంది, కావున ఈరోజు నుండి రాష్ట్రంలో కొత్త పథకాలేమి ప్రకటించే వీలు లేదు. ఇప్పటికే అమలు లో ఉన్న పథకాల అమలుకు ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు.

Comments

comments