‘మజిలీ’ సెన్సార్ రివ్యూ-చైతన్య హిట్టు కొడుతున్నాడు

Solid Pre-release business for Majili

నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మజిలీ. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.ప్రేమ .. పెళ్లి .. ఆశయం అనే మూడు బలమైన కోణాల్లో ఈ సినిమా కథ కొనసాగుతుంది. మరి ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి.

సినిమా చాలా కూల్‌గా, ఎమోషనల్‌ లవ్‌తో, మెచ్యూర్డ్‌ లవ్‌ సీన్స్‌తో సాగిందని, తప్పకుండా ఇది ఫ్యామిలీ మరియు యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతుందట..ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సరదాగా సాగిపోతుందట. చైసామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయట. పూర్ణ, శ్రావణి పాత్రల్లో వారిద్దరూ జీవించారట. మాస్ ఆడియన్స్ ను సైతం అలరించే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయట. ముఖ్యంగా ప్రేమికులు, పెళ్ళైన వాళ్ళు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం ఖాయమని సెన్సార్ బోర్డు వారు చెబుతున్నారు.

అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంత కలిసి నటించిన సినిమా అవ్వడం, అది కూడా పెళ్లి తర్వాత కలిసి మొదటి సారి నటించిన సినిమా అవ్వడంతో ఈ చిత్రంకు మంచి క్రేజ్‌ ఉంది. సినిమా విడుదలై ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్నా భారీ కలెక్షన్స్ రావడం ఖాయం..

Comments

comments