మహర్షి స్టోరీ

టాప్ హీరోల సినిమాలలో విషాదఛాయలు ఎక్కువగా ఉంటే అభిమానులు పెద్దగా లైక్ చేయరు. అయితే ‘మహర్షి’ లో గుండె బరువు ఎక్కించే కొన్ని భారీ విషాద సీన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు లీక్ అయిన ఒక షాకింగ్ న్యూస్.

తెలుస్తున్న సమాచారం వరకు ఈ మూవీలో అత్యంత కీలకమైన అల్లరి నరేష్ పాత్ర ఈమూవీ మధ్యలో చనిపోతుంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆ ఊరిలో రైతుల దయనీయ స్థితి చూసి నరేష్ చలించిపోయి నిరాశతో అనారోగ్యంపాలు అవుతాడని టాక్. తన ప్రియమిత్రుడు అనారోగ్య వార్తలు తెలుసుకుని మహేష్ ఇండియాకు తిరిగి వచ్చి నరేష్ కు వైద్యం చేయించినా ఫలితం లేకపోవడం మహేష్ ని విపరీతంగా కలిచి వేస్తుంది.
తన మిత్రుడికి వచ్చిన పరిస్థితి మరి ఏ రైతుకు రాకూడదని మహేష్ పట్టుదలతో అక్కడి రైతుల పరిస్థితి బాగు చేయడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులు అలవాటు చేయడానికి చాలా శ్రమిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో ఆ ఊరిలోని వ్యతిరేక వర్గం నుండి అడ్డంకులు ఎదురైనా మహేష్ లెక్క చేయకుండా చివరకు విజయం సాధిస్తాడట.

దీనికితోకితోడు ఈసినిమా సెకండ్ ఆఫ్ లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉండటమే కాకుండా చాలా భారీ డైలాగ్స్ కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ సినిమాలలో సర్వసాధారణంగా భారీ డైలాగ్స్ ఉండని నేపథ్యంలో ఈ భారీ సీన్స్ ను ఎడిటింగ్ లో కట్ చేయాలా లేకుంటే ఉంచాలా అన్న విషయమై ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఆ సీన్స్ ను కొంతమంది ప్రముఖులకు చూపెట్టి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు టాక్..

Comments

comments