ఒకే కారులో చంద్రబాబు వద్దకు లగడపాటి, ఏబీఎన్ రాధాకృష్ణ

lagadapati-and-abn-radhakrishna-meets-chandrababu

సోమవారం పొద్దు పోయాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధకృష్ణ భేటీ అయ్యారని సమాచారం. వారిద్దరూ ఒకే కారులో రావడానికి సంబంధించిన విజువల్స్ సాక్షి టీవీలో వచ్చాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో వీరు సర్వేల పేరుతో హడావుడి చేసి. మహాకూటమి గెలవబోతోందని ప్రచారం చేసి ఆ తరువాత ఘోరంగా భంగపడ్డారు. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ లోతెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్నదని, దానిని జనంలోకి మళ్లీ ఎలా తీసుకువెళ్లాలన్నదానిపై వారు తర్జనభర్జన పడి ఉండవచ్చని సాక్షి కధనాలు ఇస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్వేల పేరుతో ప్రజలలో గందరగోళం సృష్టించడానికి కూడా వారు ఆలోచన చేసి ఉంటారని సాక్షి చెబుతుంది. సుమారు రెండున్నర గంటల సేపు వారి సమావేశం జరిగిందని సమాచారం. ఈ భేటీ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు.

Comments

comments