ఈ కప్ప దాట్లు ఏంటి కృష్ణయ్య?

ఈ కప్ప దాట్లు ఏంటి కృష్ణయ్య?

తెలుగుదేశం పార్టీకి వెన్నెముక్కగా ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా ఆయన బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 17న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ బీసీ గర్జనకు ఆయన వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన జగన్ తో ప్రైవేటుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. బీసీలకు వైఎస్సార్‌ చేసిన మేలు అంతా ఇంతా కాదని ఆర్‌ కృష్ణయ్య అన్నారు.

వైఎస్సార్‌సీపీ గెలిస్తేనే నా జీవిత ఆశయం చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం ముందుకెళుతుందని భావిస్తున్నా అని ఆయన అన్నారు. 2014లో కృష్ణయ్య టీడీపీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తరువాతి కాలంలో పార్టీకి దూరమయ్యారు. మొన్న తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి మిర్యాలగూడలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు గా ఉంది.

Comments

comments