సైకిల్ ఎక్కబోతున్న కోట్ల

సైకిల్ ఎక్కబోతున్న కోట్ల

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఆయన తన సతీమణి, కుమారుడితో కలిసి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి డిన్నర్ కు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోట్ల అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామని వారు అంటున్నారు.

కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్ని సీట్లు సర్దుబాటు చెయ్యడం అంత తేలికైన పనేమీ కాదు. 2014 ఎన్నికలలో కర్నూల్ పార్లమెంట్ కు పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కూడా 1.1 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఆయనకు డోన్, కోడుమూరు లో ఉన్న ఫాలోయింగ్ తో ఏ పార్టీలో అయితే చేరతారో ఆ పార్టీకి కర్నూల్ ఎంపీ సీటు అనుకూలంగా మార్చగలరు. దీని వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఆయనను చేర్చుకోవడానికి ఆసక్తి చూపింది.

Comments

comments