కేసీఆర్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలి

ex-cs-as-mp-in-trs

తెలంగాణ హై కోర్టులో గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పిటీషన్ దాఖలు చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణ. గులాబీ దళపతిపై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం 2 కేసులు ఉన్నట్లు మాత్రమే చూపారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇందుకు గానూ కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ టీడీపీ మడకశిర ఎమ్మెల్యేపై సుప్రీమ్ కోర్టు అనర్హత వేటు వేసి, 2014 ఎన్నికలలో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. కేసీఆర్ మీద వేసిన పిటిషన్ లో ఎంత వరకు విషయం ఉందొ చూడాలి. మరోవైపు కొడంగల్ తెరాస ఎమ్మెల్యే పై రేవంత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పై దాసోజు శ్రావణ్ కూడా ఇటువంటి పిటిషన్లు వేశారు.

Comments

comments