కమల్ హస్సన్ ఫస్ట్ టార్గెట్ 40

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తన మొదటి ఎన్నికలను ఎదురుకోబోతున్నారు. ఈ వేసవి కాలంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీ పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలతో పాటు పాండిచ్చేరిలోని 1 లోక్‌సభలోనూ తామ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కమల్ పోటీ చేస్తారో లేక అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

పార్టీ త్వరలోనే వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోనుందని, దానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. సొంతంగానే పోటీ చేయబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని కమల్ హాసన్ గత సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రారంభించారు. తమిళనాడులోని తన స్వస్థలం రామేశ్వరంలో పార్టీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఈ వేసవిలో తేలిపోనుంది.

Comments

comments