ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజంలోని అన్ని వర్గాలను తన వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా కాపుల కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిలో 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించాలని నిర్ణయించారు.

ఈ మేరకు బిల్లుపై బుధవారం లేదా గురువారం చర్చించనున్నారు. ఈ బిల్లు పాస్ చేసి 2014 ఎన్నికల సందర్భంగా తాము వాగ్దానం చేసినట్టుగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఆయా వర్గాలు దీనితో సంతృప్తి చెందితే ఉభయ గోదావరి జిల్లాలలో దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. గత ఎన్నికలలో ఈ రెండు జిల్లాలలో టీడీపీ గణనీయంగా సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది. దీనితో మరొక సారి ఆ వర్గంపై చంద్రబాబు వల వేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

Comments

comments