పార్టీలో ఎవరు చేరుతున్నారో కూడా జనసేనకు తెలియడం లేదా?

janasena-party-in-big-dilemma

కొద్ది రోజుల క్రితం విష్ణు ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ విష్ణురాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జనసేనలో చేరారని పవన్ కళ్యాణ్ ఆయనను జనసేన పార్టీ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా నియమించారని పార్టీ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది అయితే జనసేనలో చేరుతున్న అని వచ్చిన వార్తలను విష్ణురాజు ఖండించారు.తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని,ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.

“నేను పవన్‌ కళ్యాణ్‌ రెండు మూడు సార్లు కలిసిన మాట వాస్తవమే. పవన్‌ మా విద్యాసంస్థల క్యాంపస్‌కు వచ్చారు.విద్య, ఆరోగ్యం, స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి గురించి మా మధ్య చర్చ జరిగింది. కేవలం పవన్ సిద్ధాంతాలు నచ్చి అడ్వైజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించా.అయితే నాకు రాజకీయాలలోకి రావాలనే ఆలోచన ఏమీ లేదు,” అని ఆయన చెప్పారు. ప్రెస్ నోట్ లో జనసేనలో చేరుతున్నారని చెప్పాకా ఆయన ఇలా అంటున్నారంటే జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే.

Comments

comments