మెగా హీరోలకు వార్నింగ్ ఇచ్చిన జనసేన నాయకుడు

జనసేన పార్టీ యువ నాయకుడు విష్ణు నాగిరెడ్డి ఒక వీడియో రికార్డింగ్ ద్వారా రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మొత్తానికి ఒక రౌండ్ గట్టిగా వేసుకున్నారు. ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే క్యాంపెయినింగ్ ఉన్న ఈ తరుణంలో కూడా మెగా హీరోలు రాకపోతే ఇంక వారు ఉండేది ఎందుకని ఆయన వాపోయారు.

మిగతా పార్టీలకు స్టార్ క్యాంపేనార్స్ చాలా మంది ఉన్నారని కానీ జనసేన పార్టీకి మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ గారే మొత్తం చూసుకోవాలని ఆయన తన బాధ వెళ్లగక్కారు. వైసీపీ కి జగన్ చెల్లి, అమ్మ, భార్య… తెదేపా కు కొడుకు, అల్లుళ్ళు, మామ ఇలా అందరూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీలో నాగబాబు, జేడీ లక్ష్మీనారాయణ వారివారి నియోజకవర్గాల వరకు పరిమితం కావడం జనసేనకు పెద్ద నష్టం అని అన్నారు.

రాష్ట్రంలో జనసేన గెలిచే స్థానాలు చాలానే ఉన్నాయని, ఇప్పుడు గనుక మెగా హీరోలు అక్కడ పర్యటిస్తే తప్పక పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సపోర్టు చేసినట్లు జనసేన ను చేయడం వల్ల వాళ్ళ పరువుకి నష్టం ఏమీ వాటిల్లదని, కేవలం మెగా అభిమానులు మాత్రమే వారిని ఎప్పటికీ ఆదరిస్తారని గుర్తు చేశారు. ఇకనైనా మెగా హీరోలు అంతా ఒక 50 స్థానాలు ఎంచుకొని 4 రోజులు ప్రచారం చేసినా ఫలితం తారాస్థాయిలో ఉంటాడని ఆయన ఖచ్చితంగా చెప్పారు.

Comments

comments