జగన్ అమరావతి ఇంటి గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు

వైఎస్సార్ కాంగ్రెస్ అమరావతి కార్యాలయంలో మొదటి చేరికలు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయను న్నారు. అదే రోజు పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 14న ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా షర్మిల, ఆవిడ భర్తకు జ్వరం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లండన్ లో ఉన్న జగన్ రేపు హైదరాబాద్ తిరిగి వస్తారు.

నూతన గృహప్రవేశం తర్వాత ఇకపై తాడేపల్లి నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాలను జగన్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సమర శంఖారావం సభలో జగన్ పాల్గొంటారు. ప్రధాన పార్టీ అధినేతలలో అమరావతిలో సొంత ఇల్లు ఉన్నది ఒక్క జగన్ కు మాత్రమే. ఈ అంశాన్నే అక్కడి ప్రజలలోకి గట్టిగా తీసుకుని వెళ్లి వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యాలని పార్టీ భావిస్తుంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా మొదలు పెట్టే పనిలో ఉన్నారు.

Comments

comments