జగన్ కు ఈ క్రెడిట్ పిచ్చి ఏంటి?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ మధ్య క్రెడిట్ పిచ్చి పట్టుకున్నట్టు ఉంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో కిందా మీదా పది సమాజంలోని వేరు వేరు వర్గాల ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు ఏది ప్రకటిస్తే అది మా పథకమే… మా నవరత్నాలను కాపీ కొట్టేశారు అంటూ చెప్పుకొస్తున్నారు ఆ పార్టీ నాయకులు. మరో పక్క నిన్న మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించిన ఒక పథకం 2008లో వైఎస్ ప్రకటించిన ఒక పథకం నుండి కాపీ చేశారని సాక్షి చెప్పుకొచ్చింది.

దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది 2008లో డ్వాక్రా మహిళల కోసం పెన్షన్ స్కీం కు పేరు మార్చి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారని సాక్షి అంటుంది. జగన్ కు ఈ క్రెడిట్ పిచ్చి ఏంటో?

Comments

comments