వెంకీ మామ నుంచి తప్పుకున్నాడా..తప్పించారా?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీలు వస్తున్న నేపథ్యంలో వెంకటేష్,నాగ చైతన్య కాంబినేషన్ లో మామ – అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ” వెంకీ మామ “. అయితే ఈ చిత్రంలో భాగస్వామిగా ప్రముఖ రచయిత కోన వెంకట్ చేరాడు. రియల్ లైఫ్ లో కూడా వెంకటేష్, నాగ చైతన్య మామా అళ్లుల్లే. నిన్న ఉగాది నాడు విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్స్ హడావిడిలో ఒక విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిన్నటి వరకు కోన వెంకట్ పేరు ఈ చిత్రంలో పార్ట్ నర్ లో ఒకరిగా పేరుంది కానీ రిలీజ్ చేసిన పోస్టర్ లో కోన వెంకట్ పేరు లేదు దాంతో కోన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడా ? తప్పించారా ? అన్నది తేలాల్సి ఉంది . ఇంతకీ కోన వెంకట్ మంచి రైటర్ మాత్రమే కాదు.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక వెంకిమామ కి కోన వెంకట్ ముందు రైటర్ గానే పనిచేశాడు.

వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్ 2 తో ప్రభంజనం సృష్టించాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్ల ని సాధించింది . దాంతో మంచి జోష్ లో ఉన్నాడు వెంకీ . ఇక నాగచైతన్య నటించిన మజిలీ చిత్రం కూడా నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నారు.

Comments

comments