తిరిగొచ్చిన భారత మాత ముద్దు బిడ్డ అభినందన్

పాకిస్థాన్‌ దగ్గర బందీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌ ను భారత్‌కు పాక్‌ అప్పగించింది. వాఘా సరిహద్దుకు అభినందన్‌ చేరుకున్న నేపథ్యంలో.. ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది జైహింద్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలు చేశారు. మువ్వన్నెల జెండాలతో హర్షం వ్యక్తం చేసి ఘన స్వాగతం పలికారు. ఆనందంతో పలువురు నృత్యాలు చేశారు. నియమావళి ప్రకారం అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

అనంతరం ఆయన్ని దిల్లీకి తరలించే అవకాశం ఉంది. అక్కడ ఉన్నత అధికారులు ఆయన స్టేట్మెంటులు రికార్డు చేస్తారు. అనంతరం ఆయనను తన ఇంటికి వెళ్ళడానికి అనుమతిని ఇస్తారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యలు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దాదాపుగా దాయాధి చెరలో రెండున్నర రోజులు గడిపారు అభినందన్. యుద్ధ ఖైదీని గౌరవంగా చూసి విడిచి పెట్టాలని జెనీవా కన్వెన్షన్ ఒప్పందం ఉండడం అంతర్జాతీయంగా ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆయనను పాక్ విడిచిపెట్టింది.

Comments

comments