చంద్రబాబు ఇంటి ముందు అక్రమ మైనింగ్… 100 కోట్ల జరిమానా

చంద్రబాబు ఇంటి ముందు అక్రమ మైనింగ్... 100 కోట్ల జరిమానా

ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్లు జరిమానాగా విధించింది. కృష్ణానది దగ్గర, సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని దీనిపై నివేదికలు అందజేశాయి కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు.

అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు వాటర్ మాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ. ఆ పిటిషన్‌ను విచారించిన అనంతరం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రదేశంలోనే అక్రమ మైనింగ్ ఆపలేకపోతున్నారంటే అది సిగ్గు చేటు అనే అనుకోవాలి. దీనిపై చంద్రబాబు ఏమని సమర్ధించుకుంటారో చూడాలి.

Comments

comments