రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమే: జగన్

జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్‌, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని వైఎస్ జగన్ ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌ లో చెప్పారు. అయితే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తాము ఎన్నికల తరువాత మద్దతు ఇవ్వడానికి సిద్ధమని, దానికి సహకరిస్తే రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమే అని ఆయన ప్రకటించారు.

వైఎస్ మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. “మాకు మా రాష్ట్రం, మా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదానే ముఖ్యం. ఎవ్వరు ప్రధానమంత్రి అయినా మాకు మాత్రం హోదానే కావాలి. హోదా ఇవ్వేవాళ్లకు మా మద్దతు ఉంటుంది,” అని జగన్ మరోసారి స్పష్టం చేశారు.

Comments

comments