లోకేష్ ను ఓడిస్తే మంత్రిపదవి… జగన్ బంపర్ ఆఫర్

లోకేష్ ను ఓడిస్తే మంత్రిపదవి... జగన్ బంపర్ ఆఫర్

మంగళగిరి లో నారా లోకేష్ ను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. తాజాగా అక్కడి ప్రజలకు జగన్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. “మంగళగిరిలో మా పార్టీ అభ్యర్ది ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయన కు నా మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తా,” అంటూ ప్రకటించారు జగన్. ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంగళగిరిలో మీ ఆస్తులను కాపాడతారని, లోకేష్ ను గెలిపిస్తే మీ ఆస్తులు ఏమి అవుతాయో తెలియదని చెప్పడం విశేషం.

“ఇక్కడి ప్రజలను భూముల సేకరణ పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనమంతా చూశాం. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయి. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలి,” జగన్ పిలుపునిచ్చారు. చూడబోతే లోకేష్ ను ఓడించి చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి ఉండే ఏ అవకాశాన్ని జగన్ వదులుకోవడం లేదు.

Comments

comments