ఏపీలో అన్నదాతా సుఖీభవ

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ వర్గాల ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. తెలంగాణలోని రైతు బంధు పథకం వంటి ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తక్షణ సాయంగా రాష్ట్రంలో సాగులో ఉన్న 2 కోట్లకుపైగా ఎకరాలకు, 2,500 చొప్పున సుమారు 5వేల కోట్లు అందజేయనుంది. అయితే తెలంగాణాలో కౌలు రైతులు ఈ పధకం కింద లబ్ది పొందడం లేదు. వారిని కూడా ఇక్కడ భాగస్వామ్యులను చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.

ఈ మొత్తాన్ని భూయజమానులు, కౌలు రైతులకు ఎలా పంచాలన్న అంశంపై సర్కారు తుది కసరత్తు చేస్తోంది. అసలు రైతులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అసలు రైతులే సాగుచేస్తున్న చోట ఎకరానికి 2,500 చొప్పున వారికే చెల్లిస్తారు. కౌలు రైతులున్న చోట.. 50:50 లేదా 60:40 నిష్పత్తిలో ఇద్దరికీ పంచాలని భావిస్తోంది. 2కోట్ల ఎకరాలకు ఏటా రూ.20వేల కోట్లు అందజేయాల్సి ఉంటుంది. పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది.

Comments

comments