పార్లమెంట్ ఎన్నికల ముందు తెరాసకు గుడ్ న్యూస్

KCR's Whirlwind Tour in 16 MP Constituencies of Telangana

కారు గుర్తును పోలిన గుర్తులు, కారు గుర్తును బోల్డ్ చేయడంపై గతేడాది డిసెంబర్ చివరి వారంలో సీఎం కేసీఆర్.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి నెత్తిన పాలు పోసింది. పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే కారు గుర్తును అందరికీ కనిపించేలా బోల్డ్‌గా బ్యాలెట్ పేపర్‌లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులతో టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగింది. ఆ కన్ఫ్యూషన్ వల్ల కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఒకవేళ ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా హోరాహోరీగా జరిగి ఉంటే దీని వల్ల గులాబీ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చేది.

Comments

comments