తాత మనవళ్లుగా తండ్రి కొడుకు

మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో అఖిల్ నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. ముందుగా నాగార్జున మనవడి పాత్ర కోసం నాగ చైతన్యను అనుకున్న తనకున్న కమిట్‌మెంట్స్‌ కారణంగా ఈ సినిమా చేయలేకపోతున్నాడు. దీంతో నాగ చైతన్య ప్లేస్‌లో అఖిల్ ఈ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. హీరోగా అఖిల్ కెరీర్ ఏమంత బాగాలేదు. హీరోగా వచ్చిన మూడు సినిమాలేవి ప్రేక్షకుల మెప్పును పొందలేపోయాయి. అందుకే ఇపుడు తండ్రితో చేసే సినిమాతోనైనా హీరోగా తండ్రి నాగార్జునతోొ పాటు సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

మిస్టర్ మజ్నుతర్వాత అఖిల్..బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలోొ నాల్గో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తొందర్లోనే పట్టాలెక్కనంది. ఆగష్టు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తండ్రితో చేయబోయే ‘బంగార్రాజు’ సీక్వెల్ షూటింగ్ కోసం రెడీ అయ్యే అవకాశాలున్నాయి.

Comments

comments