టీడీపీలో చేరాలనుకుంటున్న మాజీ కేంద్ర మంత్రికి అనుకోని షాక్

ex-minister-gets-a-shock-in-tdp

ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కేంద్రమాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ మంగళవారం ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. వారం పది రోజుల్లో టీడీపీలో చేరనున్నట్లు కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. తాను కాంగ్రెస్‌ను వీడడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పార్టీ కూడా బలహీనమైందన్నారు. దేశంలో మోదీని ఓడించడానికి తాను ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం మోదీపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారని, ఆ పార్టీలో చేరితే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.

అందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. అయితే ఆయనకు టీడీపీలో చేరుతున్న సమయంలోనే అనూహ్యమైన షాక్ తగిలింది. ఆయన కుమార్తె శృతి దేవి కాంగ్రెస్ తరపున అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చెయ్యడానికి పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నారు. టీడీపీ నాయకత్వం కూడా కిశోర్ చంద్రదేవ్ అదే స్థానం నుండి నిలబెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కిశోర్ చంద్రదేవ్ కు సొంత కూతురితోనే తలపడాల్సిన పరిస్థితి రావొచ్చు.

Comments

comments