లోటస్ పాండ్ లో దూకుడు రియాలిటీ షో… సీఎం సార్ అంటే గానీ పలకని జగన్

టీడీపీ నేత,ఆపద్ధర్మ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మీడియా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఫలితాలపై ఆ పార్టీ వారు లేని పోనీ ఊహలు పెట్టుకుంటున్నారని ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. లోట‌స్ పాండ్ లో దూకుడు సినిమాలో బ్ర‌హ్మానందం రియాలిటీ షో లాంటిది న‌డుస్తోంద‌ని ఎద్దేవా చేశారు. సీఎం సారు అని పిలిస్తే త‌ప్ప జ‌గ‌న్ సారు ప‌ల‌క‌డం లేదని ఆయన విమర్శించారు.

కొద్దిరోజుల్లో ఈ పిచ్చి ప‌రాకాష్ట‌కి చేరి… ఉమారెడ్డి గ‌వ‌ర్న‌ర్ అయిపోతార‌నీ, లోట‌స్ పాండ్ లోనే జ‌గ‌న్ తో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయించేయ‌డానికి విజ‌య‌సాయిరెడ్డి రెడీ అవుతున్నారని ఉమా చెప్పుకొచ్చారు. ఓటమి గురించి జగన్ కు ఇప్పటికే అర్ధం అయిపోయిందని కాకపోతే కౌంటింగ్ వరకు క్యాడర్‌ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని ఉమా అన్నారు. ఓటు వేసిన మరుక్షణం పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్.. తాము త్వరగా పోవాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, మళ్లీ పాలించేది తెలుగుదేశమేనని ధీమా వ్యక్తంచేశారు.

Comments

comments