మహర్షి డాన్ పాత్ర పై పెరుగుతున్న ఉత్కంఠ

Social Media Talk: Maharshi is mix of Srimanthudu & Bharat Ane Nenu

ఉగాది పండుగరోజున విడుదలైన ‘మహర్షి’ టీజర్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈమూవీ టీజర్ రజినీకాంత్ రికార్డులను బ్రేక్ చేయడంతో అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. రజినీకాంత్ నటించిన ‘పేటా’ మూవీ టీజర్ 12 గంటలలో 9.1 మిలియన్ వ్యూస్ సాధిస్తే ‘మహర్షి’ మూవీ ఒకే ఒక్కరోజులో 13 మిలియన్ వ్యూస్ సాధించడం దక్షిణాది సినిమారంగ రికార్డుగా మారింది.

ఇది ఇలా ఉంటే భారీ అంచనాలు ఉన్న ఈమూవీలో కీలకంగా కనిపించే ఒక డాన్ పాత్ర ఉన్నట్లు సమాచారం. అయితే ఆ డాన్ పాత్రను ఎవరు పోషించారు అన్న విషయమై ఈసినిమా యూనిట్ చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

దీనితో ఈ డాన్ పాత్రకు ‘మహర్షి’ కి ఉన్న లింక్ ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమూవీలో మహేష్ పాత్ర మూడు షేడ్స్ లో కనిపిస్తుందని మరో లీక్ ఇచ్చాడు.

ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి ఉత్తారాదికి చెందిన అనేక ప్రముఖ పట్టణాలలో కూడ ఈమూవీని విడుదల చేయబోతున్నట్లు టాక్. మహేష్ సినిమాలకు నేషనల్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేయడానికి ముంబాయి కలకత్తా ఢిల్లీ ప్రాంతాలలో కూడ ఈమూవీని భారీ పబ్లిసిటీతో విడుదల చేసే వ్యూహాలు కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి 140 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిన నేపధ్యంలో ఈమూవీ బయ్యర్లు గట్టెక్కాలి అంటే ఈమూవీకి 200 కలక్షన్స్ రావలసిన పరిస్థితి ఏర్పడింది..

Comments

comments