చిరంజీవి కొరటాల మూవీ కథ పవన్ కోసం రాసిందా?

చిరంజీవి కొరటాల మూవీ కథ పవన్ కోసం రాసిందా?

ప్రస్తుతం రాజకీయాలలో పూర్తి బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ కు పరోక్షంగా సహకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కథ ‘ఠాగూర్‌’ ‘స్టాలిన్‌’ తరహాలో సామాజిక సందేశంతో చాల పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ను దృష్టిలో పెట్టుకుని ఒక సామాజిక స్ఫూర్తి ఉన్న కథను క్రితం సంవత్సరం కొరటాల వ్రాసుకున్నట్లు టాక్. ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అయిన తరువాత షాక్ లో ఉన్న పవన్ ను కొరటాల కలిసి ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికలలోపే ఈమూవీని వేగంగా నిర్మించి ఎన్నికలలోపు విడుదల అయ్యేట్లు చూస్తానని కొరటాల చెప్పినా ఆ సూచనకు అప్పట్లో పవన్ స్పందించలేదు అని తెలుస్తోంది.
అంతేకాదు ‘అజ్ఞాతవాసి’ షాక్ తాను కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని దీనికితోడు ఎన్నికల ముందు తన మూవీ విడుదలై అది సూపర్ హిట్ అయితే పర్వాలేదు కానీ ఫలితం మరోలా ఉంటే అది తన ఇమేజ్ ని మరింత దెబ్బ తీస్తుందని పవన్ సున్నితంగా కొరటాలకు చెప్పినట్లు టాక్. అంతేకాదు ఆకథ తనకన్నా చిరంజీవికి బాగా సూటవుతుందని కొరటాల చిరంజీవిలు ఈమూవీ ప్రాజెక్ట్ విషయంలో కలిసేలా పరోక్ష సహకారం అందించినట్లు టాక్.

దీనితో కొరటాల పవన్ కు వ్రాసిన కథను చిరంజీవి కోసం మార్పులు చేసి మరిన్ని కమర్షియల్ అంశాలు ఉండే విధంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీని వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల చేయాలని చిరంజీవి కొరటాల ప్లాన్ అని అంటున్నారు..

Comments

comments