తిరిగి రాజకీయాలలోకి చిరంజీవి… ఎన్నికల ప్రచారం షురూ

తిరిగి రాజకీయాలలోకి చిరంజీవి... ఎన్నికల ప్రచారం షురూ

2014లో కాంగ్రెస్ ఓటమి తరువాత చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకున్నారు. తొలుత రాజ్యసభ సభ్యత్వం ఉన్నంత వరకూ అప్పుడప్పుడు కనిపించే వారు ఆ తరువాత పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ జనసేన కు కూడా ఆయన ప్రచారం చెయ్యడం లేదు. అయితే ఆయన కాంగ్రెస్ కు ప్రచారం చేస్తారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి వికారాబాద్‌ రానున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తెలిపారు.

వీరిరువురూ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చిరంజీవి బంధువు. ఆయన కోడలు ఉపాసన వైపు నుండి. ఇటీవలే ఆయన చిరంజీవిని కలిసి ప్రచారానికి రమ్మని ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ కు ప్రచారం చెయ్యకుండా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి ప్రచారం చేస్తే అభిమానులు దానిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. తెలంగాణాలో కాంగ్రెస్ కు కొద్దిగా అయినా అవకాశం ఉన్న సీటు ఏదన్నా ఉంటే అది చేవెళ్లే.

Comments

comments