చంద్రబాబు ఓటమిని ఒప్పేసుకున్నట్టేనా?

chandrababu-trap-for-ysrcp-and-janasena

ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేదిని కలిసి వినతపత్రం అందజేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఇది చివరి నిముషంలో సానుభూతి ఓట్ల కోసం చంద్రబాబు చేస్తున్న గిమ్మిక్ అని, గెలిచే అవకాశాలు లేకే ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాల ఆరోపణ.

మరోవైపు ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదని ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని.. తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీనియర్‌ రాజకీయ నేతగా సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 ఎమ్మెల్యే స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతుంది.

Comments

comments