జగన్ ప్రతి కదలిక మీదా చంద్రబాబుకు ఉలుకేనా

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్లోని తన లోటస్ పాండ్ ఇంటిలో ఉండి విశ్రాంతి తీసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంగారుపడుతున్నారు. జగన్ మంగళవారం అంతా హైదరాబాద్ లో నే ఉన్నారని, అది ఏమైనా కుట్రా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీని నమ్మడానికి వీలు లేదని శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఓటమి భయంతోనే చంద్రబాబు జగన్ ప్రతీ కదిలికకు భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ వారు ఆక్షేపిస్తున్నారు.

41 ఏళ్ల అనుభవం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా ఒక యువకుడిని చూసి చంద్రబాబు భయపడటం అంటే ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నట్టే అని ఎద్దేవా చేస్తున్నారు ఆ పార్టీ వారు. అయితే అమరావతి ఇంటికి గృహప్రవేశం చేసినా ప్రతీ దానికీ హైదరాబాద్ వెళ్లిపోవడం, అక్కడి అధికారపక్ష నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో అనుమానించక తప్పని పరిస్థితి.

Comments

comments